సింహాద్రి అప్పన్న సన్నిధిలో తమాషా: హీరో నితిన్ పై దొంగతనం మోపిన ఆలయ అర్చకులు?

02-04-2018 Mon 11:58 | Entertainment
  • సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నితిన్
  • స్వామి వారి ఉంగరం దొంగతనం చేశాడని నితిన్ పై అభియోగం
  • చెక్ చేసుకోమన్న నితిన్
ప్రముఖ సినీ నటుడు నితిన్ కు విశాఖపట్టణంలోని సింహ్రాద్రి అప్పన్న సన్నిధిలో చేదు అనుభవం ఎదురైంది. 'ఛల్ మోహన రంగ' సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో సింహాద్రీశుని ఆశీర్వాదం తీసుకుందామని నితిన్ సింహాచలం వచ్చాడు. ఆలయంలో నితిన్ ను తాళ్లతో బంధించిన ఆలయ అలంకారి కరి సీతారామాచార్యులు నేరుగా స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు.

ఆయన నితిన్ తో ‘ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ దొంగతనం మోపారు.

 దీంతో బిత్తరపోయిన నితిన్... ‘నేను తియ్యలేదండి, కావాలంటే చెక్‌ చేసుకోండి’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో మళ్లీ ఆయన ‘శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే’ అంటూ స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు. దీంతో నితిన్ అలాగే ఉండిపోయారు. ఆ తరువాత మరికొంత మందిని కరి సీతారామాచార్యులు బంధించి తేవడం, రాజగోపాల్ ప్రశ్నించడం జరిగింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్నవారంతా నవ్వుతూ వీక్షించారు.

అయితే దొంగతనం మోపబడిన పలువురు భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆలయాధికారులు వారిని ఓదార్చుతూ, సింహగిరి వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో చివరి రోజు వినోదోత్సవంలో భాగంగా నిర్వర్తించిన కార్యక్రమమని, అయ్యవారి ఉంగరం దొరికిందని చెప్పారు. దీంతో అంతవరకు దొంగతనం మోపబడి, ఏడ్చిన భక్తులంతా నవ్వుకున్నారు.

కాగా, అప్పన్న కల్యాణోత్సవంలో ఆరోరోజు రాత్రి దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామివారి ఉంగరం కనిపించకపోవడంతో... ఉంగరం ఉంటేనే రావాలని అమ్మవారు షరతు విధించి, అలుగుతుంది. దీంతో స్వామి మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి, భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తారు. ఇందులో భాగంగానే నితిన్ తో పాటు పలువురు భక్తులు దొంగలుగా మారారు. అదండీ విషయం!
nitinchall mohanarangaTollywoodnew movie

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more